అమెరికా బీచ్‌లో గల్లంతై మృతిచెందిన తెలంగాణ విద్యార్థి

0
43
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్ఆర్ఐ డెస్క్‌
అమెరికా బీచ్‌లో గల్లంతై తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన విద్యార్థి మృతిచెందారు.బెల్లంపల్లి పట్టణం అశోక్‌నగర్‌కు చెందిన రెడ్డి శ్రావణ్‌కుమార్‌ అనే విద్యార్థి అమెరికాలోని బోస్టన్‌ బీచ్‌లో ప్రమాదవశాత్తు గల్లంతై మృతి చెందాడు.

రిచ్‌మండ్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న శ్రావణ్‌ ఆదివారం ఈస్టర్‌ వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి సమీపంలోని బీచ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో స్నేహితులందరూ ఆనందంగా గడిపారు. అలలు ఉద్ధృతంగా రావడంతో శ్రావణ్‌ సముద్రంలో కొట్టుకు పోయాడు.

గమనించిన స్నేహితులు వెంటనే స్థానిక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు చేపట్టిన అధికారు లు సోమవారం శ్రావణ్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని అతడి సోదరుడికి సమాచారం అందజేశారు.