త్రైమాసిక ఫలితాల్లో హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్‌కు భారీ లాభాలు

0
5
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎకానమీ డెస్క్‌
మార్చి త్రైమాసిక ఫలితాలను హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంకు నేడు ప్రకటించింది.ఈ ఫలితాల్లో భారీ లాభాలతో మంచి జోష్‌ కనబరిచిం ది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 22.63శాతం నికర లాభాల్లో వృద్ధి కనిపించింది.

ఈ సీజన్లో రూ.5,805 కోట్ల లాభాన్ని విశ్లేషకులు అంచనా వేయగా అది రూ.5,885.12 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే సీజన్‌లో రూ.4,799.28 కోట్ల లాభాన్ని ప్రకటించింది. వడ్డీల రూపంలో వచ్చిన ఆదాయం 22.8శాతం పెరిగి రూ.13, 089 కోట్లకు చేరింది.

గత త్రైమాసికంతో నిఖర వడ్డీ మిగులు రూ.4.4శాతానికి చేరింది. కాకపోతే మొండిబకాయిల ప్రొవిజన్లు కూడా రూ.1,541 కోట్ల నుంచి రూ.1,889 కోట్లకు పెరిగాయి.