ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై ఎన్నికల సంఘం అభ్యంతరం

0
39
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులు, అధికారులతో సమీక్షలు, వీడియో కాన్ఫ్‌రెన్స్‌లు నిర్వహిస్తూ ఎన్నికల కోడ్‌ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నవేళ సమావేశాలు, వీడియో కాన్ఫ్‌రెన్స్‌లు నిర్వహించరాదని స్పష్టం చేసింది.

అంతేకాకుండా ఎన్నికల కోడ్‌ నిబంధనలను సీఈవో గోపాలకృష్ణ ద్వివేది మరోసారి గుర్తు చేశారు. చంద్రబాబు సమీక్షలపై పలు వురు మీడియా ప్రతినిధులు సీఈవోను సంప్రదించగా, ఎన్నికల కోడ్‌ చూస్తే మీకే తెలుస్తుందని ఆయన సమాధానం ఇచ్చా రు.కాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వ్యవహారాలపై సమీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఆయన పోలవరం, సీఆర్‌డీఏపై సమీక్ష జరిపారు. అయితే సమీక్షలు చేయడం కూడా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే అని ఈసీ వర్గాలు స్పష్టం చేయడంతో ముఖ్యమంత్రి హోంశాఖపై సమీక్షను రద్దు చేసుకున్నారు.