
మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
గురువారం తెలంగాణా ఇంటర్ ఫలితాలు
తెలంగాణ ఇంటర్ ఫలితాలు గురువారం సాయంకాలం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను మీడియాకు తెలిపారు.గురువారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి విడుదల చేస్తారని తెలిపారు. సుమారు 9లక్షల మందికి పైగా హాజరైన విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
1. హైదరాబాద్లోని ఎంజే మార్కెట్ సమీపంలోని హిందీనగర్లోని ఓ ఫర్నిచర్ గోదాములో బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి లక్షలాది రూపాయిల ఆస్థి నష్టం సంభవించింది. మంటలను చూసి జనం పరుగులు తీశారు.
2. లోకసభ ఎన్నికల వేళ బుధవారం మధ్యప్రదేశ్, రాజస్ధాన్, గుజరాత్, మహారాష్ట్రలో ఉరుములు, పిడుగులతో పాటు తీవ్రమైన ఈదురు గాలలతో భారి వర్షాలు కురిశాయి. దీంతో వివిధ ప్రాంతాలలో 34 మంది మరణించారు. అకాల వర్షాలు నాలుగు రాష్ట్రాలను ముంచెత్తడంతో భారీ నష్టం వాటిల్లింది.
3. వివిధ రకాల ఆరోపణలు, విచ్చల విడి నగదు పంపిణి, ఎన్నికల నిబంధనలను తొంగలో తొక్కారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడులో వేలూరు లోకసభ స్థానానికి గురువారం (ఏప్రిల్ 18న)జరగాల్సిన ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత్ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
4. ఎన్నికలలో ఓటర్లును డబ్బుతో ప్రలోభపెట్టడానికి ప్రయత్నించేందుకు తరలిస్తున్న రూ.1.48 కోట్ల నగదును తమిళనాడు రాష్ట్రంలోని తెనే జిల్లా అండిపట్టులో ఆదాయపన్ను శాఖ అధికారులు పట్టుకొన్నారు. ఈసందర్బంగా కొందరు తిరగబడగా పోలీసులు గాలులోకి కాల్పులు జరిపారు.
5. భారత ప్రధాని నరేంద్ర మోది మహారాష్ట్రలోని షోలాపూర్ లో బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన తరగతులంటే కాంగ్రెస్ పార్టికి చిన్నచూపు అని, తాను ఈ ప్రభుత్వానికి కాపలదారుగా (చౌకిధార్ గా) ఉంటున్నానని అంటే తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని, బిసిలు రాజ్యపాలన చేయడం రాహుల్ కు ఇష్టంలేదని విమర్శించారు.
6. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైన మతస్తులకు వర్థమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.
7. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల బుధవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు.అనంతరం ఆయన తిరుమలలోని పలు ప్రాంతాలను దర్శించుకొన్నారు. ఆయన పర్యటనకు తిరుమలలో బారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
8. ప్రపంచంలో అతిపెద్ద ఒక రోజు ఎన్నికలు ఇండోనేషియాలో బుధవారం జరిగాయి. దేశంలో అధ్యక్ష, వివిధ ప్రొవెన్సీలకు జరిగిన ఎన్నికలలో వందలాది మంది అభ్యర్థులు పోటి చేశారు. 190 మిలియన్ల ఓటర్లు, 8లక్షల పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7గంటలనుంచి 1 గంట వరకు జరిగాయి. ఫలితాలు తక్షణమే ప్రకటించడానికి ఏర్పాట్లు చేశారు.
9. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధి బుధవారం కేరళలోని వయనాడ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కేరళలో అందరికి అందుబాటులో ఉంటానని హామి ఇచ్చారు. దేశంలోని మిగతా ప్రాంతాలు ఎంత ముఖ్యమో దక్షిణాది కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని చాటడం కోసమే ఇక్కడి నుంచి పోటీచేస్తున్నానన్నారు. రాహుల్ ఈ ఎన్నికలలో అమేథితోపాటు వయనాడ్ లో కూడ పోటి చేస్తున్నారు.
10.మార్చి6 ఆన్ లైన్ లో అత్యధిక విక్రయాలతో వినియోగదారులను ఆకర్షించిన షియోమీకి చెందిన రెడ్మీ నోట్ 7 స్మార్ట్ఫోన్ ఇప్పుడు భారత్లో ఓపెన్ సేల్లో లభిస్తున్నది. రెడ్మీ నోట్ 7 స్మార్ట్ఫోన్లో 6.3 ఇంచుల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.