రాయుడు, పంత్‌లను ప్రపంచకప్‌ స్టాండ్‌ బై ఆటగాళ్లుగా ఎంపిక చేసిన బీసీసీఐ

0
41
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ప్రపంచకప్‌-2019 భారత జట్టుకు ఎంపిక కాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ అంబటి రాయుడు, యువ సంచలనం రిషబ్‌ పంత్‌లకు కాస్త ఊరట లభించింది. వీరిద్దరినీ ప్రపంచకప్‌ జట్టుకు స్టాండ్‌బై ఆటగాళ్లుగా బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఎంపికైన 15 మందిలో ఎవరైనా గాయపడితే వీరు ఇంగ్లాండ్‌ వెళ్లే విమానం ఎక్కుతారు.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడుతున్న పేసర్‌ నవ్‌దీప్‌ సైనీని సైతం స్టాండ్‌బై జాబితాలో చేర్చారు.పంత్‌, రాయుడుని ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయకపోవడంతో సెలక్టర్లపై విమర్శలు వస్తున్నాయి. సునిల్‌ గావస్కర్‌, గౌతమ్‌ గంభీర్‌ సహా మరికొందరు మాజీలు వీరికి అండగా నిలిచారు. అయితే ప్రస్తుతం స్టాండ్‌బై ఎంపిక చేసిన వారినే కాకుండా అవసరమైతే ఎవరినైనా అక్కడికి పంపించొచ్చు.

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ తరహాలోనే మనకిప్పుడూ ముగ్గురు స్టాండ్‌బై ఆటగాళ్లు ఉన్నారు. రిషభ్‌ పంత్‌, అంబటి రాయుడు బ్యాట్స్‌మన్‌ కాగా సైనీ బౌలర్ల జాబితాలో ఉన్నాడు. ప్రస్తుత జట్టులో ఎవరైనా గాయపడితే వీరి ముగ్గురిలో ఎవరో ఒకరు అక్క డికి వెళ్తారని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

ఖలీల్‌ అహ్మద్‌, అవేశ్‌ ఖాన్‌, దీపక్‌ చాహర్‌ అధికారికంగా స్టాండ్‌బై ఆటగాళ్లు కారు. బౌలర్లు ఎవరైనా గాయపడితే వీరిలో ఎవరితోనైనా భర్తీ చేసే అవకాశం ఉంది. పూర్తిగా బ్యాట్స్‌మన్‌ అయితే రాయుడు లేదా పంత్‌కు అవకాశం దక్కుతుందని ఆ అధికారి తెలిపారు.