పరిషత్‌ ఎన్నికలపై జోక్యం చేసుకోలేం – తెలంగాణ హైకోర్టు స్పష్టం

0
21
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
పరిషత్‌ ఎన్నికల నోటిఫకేషన్‌ ఇవ్వకూడదంటూ ఉత్తర్వులు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.తెలంగాణలో త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.బీసీ రిజర్వేషన్ల అంశంలో అన్యాయం జరిగిందంటూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ పిటిషన్‌ దాఖలుచేసిన విషయం తెలిసిందే.

బీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని బీసీ జనాభాను లెక్కించిన తర్వాత దాని ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయా లని ఆయన కోరారు. పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేలోపు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉన్నందున ఆ నోటి ఫికేషన్‌ జారీచేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థించారు. అయితే, పిటిషనర్‌ అభ్య ర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కొనసాగించాల్సిందేనని పేర్కొంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వివాదాలపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిం చింది. ఈ అంశంపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది.