Today Top News April 16th (మంగళవారం) ఈ రోజు వార్తల కోసం తప్పక manachannel.in క్లిక్ చేయండి. షేర్ చేయండి.

0
91
advertisment

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్

ఉత్తరప్రదేశ్ లో యోగి, మాయవతిల ప్రచారాన్ని నిషేదించిన ఎన్నికల సంఘం
ఉత్తరపద్రేశ్ లో లోకసభ ఎన్నికల ప్రచారంలో నిబంధనలను అతిక్రమించిన ఆరాష్ట్ర ముఖ్యమంత్రి ఆధిత్యనాద్ యోగి, మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయవతిల ప్రచారాన్ని నిషేదిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. మతపరమైన సున్నిత అంశాల విషయంలో వీరు ఇరువురు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించినందులకు వారిని ఎన్నికల ప్రచారం నుంచి నిషేదించినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దీంతో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి మంగళవారం ఉదయం 6గంటలనుంచి 72 గంటలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గోనరాదు. అలాగే మాజీ ముఖ్యమంత్రి మాయవతి మంగళవారం ఉదయం 6గంటల నుంచి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గోనరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది.నేతల ఎన్నికల వేళ నోరు జారకుండ ఉండడం మంచిది.                                                          ఏప్రిల్ 18 తెలంగాణ ఇంటర్ ఫలితాలు                                                                                          ఎట్టికేలకు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు తాము ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎపి తెలంగాణాలో ఇంటర్ పరీక్షలు ఒకే మారు నిర్వహించగ, ఫలితాల వషయంలో తెలంగాణాలో జాప్యం అవుతుండడంతో తెలంగాణ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎం.సెట్, ఇతర జాతీయ స్థాయి అర్హత పరీక్షలు నిర్వహణ, అడ్మిషన్లు జరగనున్నందున విద్యార్థులు ఫలితాలకోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

లక్నో లోకసభ స్థానానికి ఏప్రిల్ 16న రాజనాథ్ సింగ్ నామనేషన్
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోకసభ స్థానానికి బిజెపి అభ్యర్థిగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఏప్రిల్ 16 వతేది నామనేషన్ దాఖలు చేయనున్నారు.రాజనాథ్ సింగ్ ఏప్రిల్ 16వతేది మంగళవారం ఉదయం 9గంటలకు మహాత్మగాంధి, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాలకు పూల వేసి ఊరేగింపుగా వెళ్లి 12గంటలకు కలెక్టరేట్ లో నామనేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బిజెపి పార్టికి చెందిన పలువురు నాయకులు హాజరు కానున్నారు.                                                                                                                               భారత్ లో అత్యంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న రాజకీయ పార్టీ బి.ఎస్.పి- నాల్గవ స్థానంలో తెలుగుదేశం             దేశంలోని రాజకీయ పార్టీలలో అత్యంత నగదు నిల్వ బ్యాంకులో  ఉన్న రాజకీయ పార్టీగా బి.ఎస్.పి(బహుజన సమాజ్ వాది)ప్రథమ స్థానంలో నిలిచింది.  రెండవ స్థానంలో సమాజ వాది పార్టీకి నిలిచింది.అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో విరాళాల రూపంలో సేకరించిన సొమ్మును ఆయా రాజకీయ పార్టీలు  బ్యాంకులలో జమ చేశాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బి.ఎస్.పి వద్ద రూ.669 కోట్లు పబ్లిక్ సెక్టార్ కు చెందిన 8 ఖాతాలలో ఈ నగదు నిల్వలు ఉన్నట్లు ఆపార్టీ ఎన్నికల కమిషన్  కు ఇచ్చిన నివేదికలో వెల్లడించింది.ఉత్తర ప్రదేశ్ కు చెందిన మరో ప్రధాన రాజకీయ పార్టీ సమాజ్ వాది పార్టీకి రూ.471 కోట్లు తమ ఖాతాలలో నిల్వ ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు.మూడవ స్థానంలో కాంగ్రెస్ రూ.196 కోట్లు బ్యాంకులో తమ ఖాతాలలో నిల్వ ఉంచుకోగా,  తెలుగుదేశం పార్టీ నాల్గువ స్థానంలో రూ.107 కోట్లు నగదు నిల్వలు ఉండడం విశేషం.
వివిధ రాజకీయ పార్టీలకు బ్యాంక్ లలో నిల్వ ఉన్న నగదు వివరాలు కింది విధంగా ఉన్నాయి.
1. బి.ఎస్.పి -రూ.669 కోట్లు
2. ఎస్.పి – రూ.471 కోట్లు
3. కాంగ్రెస్ – రూ.196 కోట్లు
4. టిడిపి – రూ.107 కోట్లు
5. బిజెపి – రూ.83 కోట్లు
6. సి.పి.ఎం.-రూ.3 కోట్లు
7. అప్ –     రూ.3 కోట్లు

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి సుప్రీం నోటీసులు

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రఫేల్‌ వివాదంపై సుప్రీం కోర్టు ఎన్నడూ చేయని వ్యాఖ్యలను రాహుల్‌ పేర్కొన్నారని, తన అభిప్రాయాలను న్యాయస్థానానికి ఆపాదిస్తున్నారని ఆరో పిస్తూ భాజపా ఎంపీ మీనాక్షీ లేఖీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.రాహుల్‌ గాంధీ మీడియాలో అన్నట్లుగా తాము ఎప్పుడూ వ్యాఖ్యానించలేదని, అలాంటి అభిప్రాయాలను కూడా వెల్లడించ లేదని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. దీనిపై ఈ నెల 22లోగా రాహుల్‌ సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రఫేల్‌ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ఇటీవల అంగీకరించిన విషయం తెలిసిందే.దీనిపై రాహుల్‌ స్పందిస్తూ దేశం మొత్తం చౌకీదారే దొంగ అంటోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా న్యాయం గురించి మాట్లాడిం దని వ్యాఖ్యలు చేశారు. దీంతో మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు తీర్పునకు రాహుల్‌ తన సొంత ఆరోపణలు ఆపాదిస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

జార్ఖండ్ లో ఎన్ కౌంటర్ – ముగ్గురు మావొలు,ఒక జవాన్ మృతి

సోమవారం జార్ఖండ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావొయిస్టులు,ఒక జవాన్ మరణించారు. జార్ఖండ్ లోని గిరిదీహ్‌ అడవుల్లో ఈఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, సీఆర్పీఎఫ్‌ జవాన్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్‌ హతమయ్యారు.సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గిరిదీహ్‌ జిల్లా బెల్బాఘాట్‌ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ ఏడో బెటాలియన్‌కు చెందిన జవాన్లు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు నక్సల్స్‌ను హతమార్చారు. ఘటనాస్థలంలో ఒక ఏకే-47 రైఫిల్‌, 3 బులెట్‌ మ్యాగజైన్లు, 4 పైపు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.మావోయిస్టుల కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో ముమ్మర గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 29 నుంచి ఝార్ఖండ్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

వన్డే ప్రపంచకప్‌-2019కు భారతజట్టును ప్రకటించిన బీసీసీఐ                                                                              మే నెలలో ఇంగ్లాండ్‌ వేదికగా ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌-2019 కోసం తలపడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ముంబయిలో సమావేశమైంది. ఈ సమా వేశానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హాజరయ్యాడు. ప్రపంచకప్‌లో ఆడే 15 మందితో కూడిన టీమిండియా జట్టను మీడియాకు ప్రకటించారు. అయితే ఈ జట్టులో రిషభ్‌ పంత్‌, అంబటి రాయుడికి చోటు దక్కలేదు.                                                         వన్డే ప్రపంచకప్‌కు టీమిండియా జట్టు ఇదే –  విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), ధోనీ, శిఖర్‌ ధావన్‌, కేదార్‌ జాదవ్‌, విజయ్‌ శంకర్‌, కేఎల్‌ రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌యాదవ్‌, బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎస్‌ ఎల్‌.వి.సుబ్రమణ్యం దంపతులు                                                         కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడిని సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రమణ్యం దంపతులు దర్శించుకున్నారు.ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. ప్రధానకార్యదర్శి హోదాలో తొలిసారిగా తిరుమలకు వచ్చిన ఆయనకు ఆలయ మర్యాదలతో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న సీఎస్‌ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. సుబ్రహ్మణ్యం దంపతులకు తితిదే జేఈవో శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు.