శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎస్‌ ఎల్‌.వి.సుబ్రమణ్యం దంపతులు

0
96
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – తిరుమల
కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడిని సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రమణ్యం దంపతులు దర్శించుకున్నారు.

ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. ప్రధానకార్యదర్శి హోదాలో తొలిసారిగా తిరుమలకు వచ్చిన ఆయనకు ఆలయ మర్యాదలతో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికారు.

శ్రీవారిని దర్శించుకున్న సీఎస్‌ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. సుబ్రహ్మణ్యం దంపతులకు తితిదే జేఈవో శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు.