వన్డే ప్రపంచకప్‌-2019కు భారతజట్టును ప్రకటించిన బీసీసీఐ

0
44
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
మే నెలలో ఇంగ్లాండ్‌ వేదికగా ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌-2019 కోసం తలపడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ముంబయిలో సమావేశమైంది. ఈ సమా వేశానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హాజరయ్యాడు. ప్రపంచకప్‌లో ఆడే 15 మందితో కూడిన టీమిండియా జట్టను మీడియాకు ప్రకటించారు. అయితే ఈ జట్టులో రిషభ్‌ పంత్‌, అంబటి రాయుడికి చోటు దక్కలేదు.

వన్డే ప్రపంచకప్‌కు టీమిండియా జట్టు ఇదే

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), ధోనీ, శిఖర్‌ ధావన్‌, కేదార్‌ జాదవ్‌, విజయ్‌ శంకర్‌, కేఎల్‌ రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌యాదవ్‌, బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ