లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

0
47
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి.సెన్సెక్స్‌ 138 పాయింట్ల లాభంతో 38,905 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 11,690 వద్ద ముగిశాయి. టాటామోటార్స్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌, ఐటీసీ, టాటా స్టీల్స్‌ కంపెనీలు భారీ లాభాల్లో ముగిశాయి.

నిన్నటితో పోలిస్తే నేడు రూపాయి ట్రేడింగ్‌ లాభాల్లో కొనసాగుతోంది. ఇన్ఫోసిస్‌ షేర్లు 5శాతం నష్టపోయాయి. ఆ కంపెనీ అంచ నాల కంటే తక్కువ ఆదాయంపై పన్ను చెల్లించడతో మధుపరుల విశ్వాసం దెబ్బతింది.

పీసీ జ్యూవెలర్స్‌ షేర్లు దాదాపు 14శాతం లాభపడ్డాయి. ఈ కంపెనీలో ఎఫ్‌పీఐలు దాదాపు 2శాతం వాటా కొనుగోలు చేస్తున్నా రనే వార్తలతో షేరు దూసుకెళ్లింది. గత జులై తర్వాత ఈ షేరు ఇంతగా లాభపడటం ఇదే. స్పైస్‌జెట్‌ షేర్లు కూడా 7.82శాతం లాభపడ్డాయి.