లక్నో లోకసభ స్థానానికి ఏప్రిల్ 16న రాజనాథ్ సింగ్ నామనేషన్

0
25
advertisment

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోకసభ స్థానానికి బిజెపి అభ్యర్థిగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఏప్రిల్ 16 వతేది నామనేషన్ దాఖలు చేయనున్నారు.రాజనాథ్ సింగ్ ఏప్రిల్ 16వతేది మంగళవారం ఉదయం 9గంటలకు మహాత్మగాంధి, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాలకు పూల వేసి ఊరేగింపుగా వెళ్లి 12గంటలకు కలెక్టరేట్ లో నామనేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బిజెపి పార్టికి చెందిన పలువురు నాయకులు హాజరు కానున్నారు.