భారత్ లో అత్యంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న రాజకీయ పార్టీ బి.ఎస్.పి- నాల్గవ స్థానంలో తెలుగుదేశం

0
83
advertisment

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
దేశంలోని రాజకీయ పార్టీలలో అత్యంత నగదు నిల్వ బ్యాంకులో  ఉన్న రాజకీయ పార్టీగా బి.ఎస్.పి(బహుజన సమాజ్ వాది)ప్రథమ స్థానంలో నిలిచింది.  రెండవ స్థానంలో సమాజ వాది పార్టీకి నిలిచింది.అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో విరాళాల రూపంలో సేకరించిన సొమ్మును ఆయా రాజకీయ పార్టీలు  బ్యాంకులలో జమ చేశాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బి.ఎస్.పి వద్ద రూ.669 కోట్లు పబ్లిక్ సెక్టార్ కు చెందిన 8 ఖాతాలలో ఈ నగదు నిల్వలు ఉన్నట్లు ఆపార్టీ ఎన్నికల కమిషన్  కు ఇచ్చిన నివేదికలో వెల్లడించింది.ఉత్తర ప్రదేశ్ కు చెందిన మరో ప్రధాన రాజకీయ పార్టీ సమాజ్ వాది పార్టీకి రూ.471 కోట్లు తమ ఖాతాలలో నిల్వ ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు.

మూడవ స్థానంలో కాంగ్రెస్ రూ.196 కోట్లు బ్యాంకులో తమ ఖాతాలలో నిల్వ ఉంచుకోగా,  తెలుగుదేశం పార్టీ నాల్గువ స్థానంలో రూ.107 కోట్లు నగదు నిల్వలు ఉండడం విశేషం.
వివిధ రాజకీయ పార్టీలకు బ్యాంక్ లలో నిల్వ ఉన్న నగదు వివరాలు కింది విధంగా ఉన్నాయి.
1. బి.ఎస్.పి -రూ.669 కోట్లు
2. ఎస్.పి – రూ.471 కోట్లు
3. కాంగ్రెస్ – రూ.196 కోట్లు
4. టిడిపి – రూ.107 కోట్లు
5. బిజెపి – రూ.83 కోట్లు
6. సి.పి.ఎం.-రూ.3 కోట్లు
7. అప్ –     రూ.3 కోట్లు