తెలంగాణలో ఏడుగురు నూతన ఎమ్మెల్సీల ప్రమాణం

0
14
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
ఏడుగురు కొత్త ఎమ్మెల్సీ సభ్యులు సోమవారం తెలంగాణ శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేశారు.మండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

తెరాసకు చెందిన మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, యెగ్గే మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి, ఎంఐఎంకు చెందిన మీర్జా రియాజ్‌ హసన్‌తో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎ. నర్సిరెడ్డి, రఘోత్తమ్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.