జార్ఖండ్ లో ఎన్ కౌంటర్ – ముగ్గురు మావొలు,ఒక జవాన్ మృతి

0
21
advertisment

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
సోమవారం జార్ఖండ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావొయిస్టులు,ఒక జవాన్ మరణించారు. జార్ఖండ్ లోని గిరిదీహ్‌ అడవుల్లో ఈఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, సీఆర్పీఎఫ్‌ జవాన్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్‌ హతమయ్యారు.

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గిరిదీహ్‌ జిల్లా బెల్బాఘాట్‌ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ ఏడో బెటాలియన్‌కు చెందిన జవాన్లు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు నక్సల్స్‌ను హతమార్చారు. ఘటనాస్థలంలో ఒక ఏకే-47 రైఫిల్‌, 3 బులెట్‌ మ్యాగజైన్లు, 4 పైపు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్టుల కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో ముమ్మర గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 29 నుంచి ఝార్ఖండ్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.