కడపజిల్లాలో రెండు అగ్నిప్రమాదాలు – కోటిరూపాయలకు పైగా ఆస్థి నష్టం

0
11
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – వైఎస్సార్‌ కడప
భానుడి తనప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవికాలం ఆరంభమైంది. అక్కడక్కడా అప్పుడే అగ్నిప్రమాదాలు జరుగుతు న్నాయి.తాజాగా కడప జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో కోటి రూపాయలకు పైగా ఆస్తినష్టం సంభవించింది.

రెండు చోట్లా రైతులకు సంబంధించిన విలువైన పంట అగ్నికి ఆహుతవ్వడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు.లింగాల మండలం దొండ్లవాగు సమీపంలోని దేవిరెడ్డి సంజీవరెడ్డి గోదాములో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గోదాములో నిల్వ చేసిన శనగ, ధనియాలు, జొన్నలు దగ్ధమయ్యాయి. కోటి రూపాయలకు పైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.

అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుతాఘాతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.కడప నగరంలోని దేవుని కడపలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో పసుపు ప్రాసెసింగ్‌ యూనిట్‌లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.20లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది.