ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి సుప్రీం నోటీసులు

0
17
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రఫేల్‌ వివాదంపై సుప్రీం కోర్టు ఎన్నడూ చేయని వ్యాఖ్యలను రాహుల్‌ పేర్కొన్నారని, తన అభిప్రాయాలను న్యాయస్థానానికి ఆపాదిస్తున్నారని ఆరో పిస్తూ భాజపా ఎంపీ మీనాక్షీ లేఖీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.

రాహుల్‌ గాంధీ మీడియాలో అన్నట్లుగా తాము ఎప్పుడూ వ్యాఖ్యానించలేదని, అలాంటి అభిప్రాయాలను కూడా వెల్లడించ లేదని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. దీనిపై ఈ నెల 22లోగా రాహుల్‌ సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రఫేల్‌ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ఇటీవల అంగీకరించిన విషయం తెలిసిందే.

దీనిపై రాహుల్‌ స్పందిస్తూ దేశం మొత్తం చౌకీదారే దొంగ అంటోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా న్యాయం గురించి మాట్లాడిం దని వ్యాఖ్యలు చేశారు. దీంతో మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు తీర్పునకు రాహుల్‌ తన సొంత ఆరోపణలు ఆపాదిస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.