ఉత్తరప్రదేశ్ లో యోగి, మాయవతిల ప్రచారాన్ని నిషేదించిన ఎన్నికల సంఘం

0
21
advertisment

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
ఉత్తరప్రదేశ్ లో  లోకసభ ఎన్నికల ప్రచారంలో నిబంధనలను అతిక్రమించిన ఆరాష్ట్ర ముఖ్యమంత్రి ఆధిత్యనాద్ యోగి, మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయవతిల ప్రచారాన్ని నిషేదిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది.

మతపరమైన సున్నిత అంశాల విషయంలో వీరు ఇరువురు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించినందులకు వారిని ఎన్నికల ప్రచారం నుంచి నిషేదించినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దీంతో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి మంగళవారం ఉదయం 6గంటలనుంచి 72 గంటలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గోనరాదు.

అలాగే మాజీ ముఖ్యమంత్రి మాయవతి మంగళవారం ఉదయం 6గంటల నుంచి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గోనరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది.నేతల ఎన్నికల వేళ నోరు జారకుండ ఉండడం మంచిది.