రోడ్డు ప్రమాదంలో తాహిశీల్దార్ దుర్మరణం

0
590
advertisment

మనఛానల్ న్యూస్ – అనంతపురం
ఆదివారం ఉదయం అనంతపురం జిల్లా గార్లదిన్నె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తహిశీల్దార్ దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో గుడ్డాలపల్లి గ్రామ సమీపంలో కారు అదుపు తప్పడంతో కారులో ప్రయాణిస్తున్న కర్నూలు జిల్లా బనగానపల్లి తహసీల్దార్‌ విష్ణువర్ధన్‌రెడ్డి(48) అక్కడిక్కడే మృతిచెందారు.

ఆదివారం సెలవు కావడంతో కారులో స్వంతంగా డ్రైవింగ్ చేసుకొంటూ వెళ్లుతున్న సమయంలో అదుపు తప్పి ప్రమాదం సంభవించింది, ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.