మదనపల్లి ఎస్.టి.యు కార్యలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

0
69
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదివారం మదనపల్లి పట్టణంలోని ఎస్.టి.యు డివిజనల్ కార్యలయంలో ఎస్.టి.యు డివిజనల్ కన్వీనర్ మూడే గిరిధర్ నాయక్, సంఘం రాష్ట్ర నాయకులు ఎం.వి.రమణప్ప,మధుసూధనల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.అనంతరం సంఘం రాష్ట్ర నాయకులు ఎం.వి.రమణప్ప మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యంగ రచనకు ఎంతో శ్రమించారని, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా అభ్యున్నతి సాధించడానికి రాజ్యంగం ద్వారా పలు హక్కులు కల్పించి అందరి హృదయాలలో నిలిచిపోయారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రెడ్డివారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్టిబాబు,ఎస్.టి.యు జిల్లా ఆర్థిక కార్యదర్శిలక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా అధనపు ప్రధాన కార్యదర్శి ఆర్.వి రమణ,ఉపాధ్యక్షులు బొమ్మిశెట్టి చలపతి,నరసింహులు, బాస్కర్ రెడ్డి, జాఫర్ వలి,గోపాల్ నాయక్,రెడ్డప్పరెడ్డి, శేఖర్ రెడ్డి, రమణ, క్రిష్ణప్ప, డ్రాయింగ్ మాస్టర్ పోలేపల్లి శ్రీనివాసులు, రాజారెడ్డి తదితరులు పాల్గోన్నారు.