మండల పరిషత్‌ ఎన్నికలపై ఈనెల 15న తెరాస విస్తృత కార్యవర్గ సమావేశం

0
5
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెంగాణలో పార్లమెంట్‌ ఎన్నికలు ముగియడంతో మండల పరిషత్‌ ఎన్నికలపై తెరాస దృష్టి సారించింది.దీంతో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల కోసం ఈనెల 15న తెరాస పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించారు.

మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సన్నాహక సమావేశానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు

కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్ని కల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సన్నాహక సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు.