తెలంగాణలో పరిషత్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

0
164
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.ఇక మండల పరిషత్‌ ఎన్ని కల సమరానికి నగారా మోగింది.ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ఈ నెల నాలుగో వారంలో ప్రారంభం కానుం ది. వచ్చే నెల 14వ తేదీ లోపు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాతే ఈ ఓట్ల లెక్కింపు చేపడతారు.రాష్ట్రంలో వరుస ఎన్నికల హవా నడుస్తోంది. కొద్ది నెలల క్రితమే శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. రెండు రోజుల క్రితమే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఆ ఓట్ల లెక్కింపు చేపట్టకముందే మరో ఎన్నికలు వచ్చాయి.

త్వరలో పదవీకాలం ముగియనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధమన్న రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖపై చర్చించి ఎన్నికల నిర్వహణకు నిర్ణయించింది.

స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నేపథ్యంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించింది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాతే ఓట్ల లెక్కింపు చేపట్టాలని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల ప్రాతిపదికగానే జరగనున్నా యి. రాష్ట్రంలోని మొత్తం 5857 ఎంపీటీసీ స్థానాలు, 535 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.

– మొదటి దశ పోలింగ్‌ తేదీ: 06.05.2019
– రెండో దశ పోలింగ్‌ తేదీ: 10.05.2019
– మూడో దశపోలింగ్‌ తేదీ: 14.05.2019