టీ20 చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున ముంబై ఇండియన్స్‌

0
45
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ఐపీఎల్‌ ఫ్రాంచైజీలలో ఒకటైన ముంబై ఇండియన్స్‌ జట్టు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.టీ20 చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ సరికొత్త రికార్డు నెలకొల్పింది.

తాజా ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఈ ఫీట్‌ను నమోదు చేసింది. ఇది ముంబై ఇండి యన్స్‌కు 200వ టీ20 మ్యాచ్‌.దీంతో టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకూ సోమర్‌సెట్‌(199 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును ముంబై ఇండియన్స్‌ చెరిపేసింది.

అదే సమయంలో రెండొందల టీ20 మ్యాచ్‌ల ఆడుతున్న తొలి జట్టుగా ముంబై ఇండియన్స్‌ గుర్తింపు సాధించింది. ఈ జాబితా లో ముంబై ఇండియన్స్‌, సోమర్‌సెట్‌ల తర్వాత స్థానాల్లో హంప్‌షైర్‌(194), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(188), ససెక్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌(187)లు ఉన్నాయి.