ఏపిలో టిడిపి ప్రభుత్వ అనుకూల అధికారులలో ఆందోళన – కేంద్ర సర్వీసులకు దరఖాస్తు

0
326
advertisment

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపిలో ప్రభుత్వం మారుతోందా… అవుననే సంకేతాలు అందుతున్నాయి. దీనిని పసిగట్టిన ప్రభుత్వ ఉన్నతాధికారులు పలువురు తట్టబుట్ట సర్ధుకొంటున్నట్లు కనిపిస్తోంది. ఏపిలో ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికలలో గెలిచే పరిస్థితి లేదని సంకేతాలు అందుతున్న తరుణంలో ప్రస్తుత ప్రభుత్వ నేతలతో అత్యంత సన్నిహితంగా మెలిగిన పలువురు సివిల్ సర్వీసు అధికారులు ఏకంగా రాష్ట్రాన్నే వదలి కేంద్రసర్వీసులకు వెళ్లడానికి దరఖాస్తులు చేసుకోవడం మెుదలుపెట్టారు.

ఒక వైపు ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలలో ఓటింగ్ శాతం భారిగా పెరగడం, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నట్లు కనిపిస్తుండడం, మరో వైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓడిపోతామనే సంకేతాలతో ఎన్నికల కమీషన్ పై యుద్ధం చేస్తున్నట్లు ప్రకటించడం, ఇ.వి.ఎంల పనితీరుపై హఠత్తుగా అనుమానాలు వ్యక్తం చేయడం, ఢిల్లీలో ఎన్నికల కమీషన్ వద్ద హై డ్రామా చేయడంతో టిడిపి గెలుపుపై అధికారులకు అనుమానాలు వచ్చి, ప్రభుత్వ మార్పు తధ్యమని గట్టిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిస్థితులలో కొత్త ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యత లభించదనే ఉద్దేశ్యంతో రాష్ట్రం వదలి వెళ్లడమే ఉత్తమమని భావించి కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి ధరఖాస్తు చేసుకొంటున్నట్లు సమాచారం. మెుత్తం మీద ఏపిలో ఎన్నికలు మార్పుకు సంకేతాలు ఉన్నట్లు స్పష్టం అవుతోంది.ఉన్నతాధికారుల తీరు చూసిన వైసిపి శ్రేణులలో ఉత్సహాం ఉరకలేస్తోంది. మే23 ఫలితాలలో తమ ప్రభుత్వం ఖాయమనే భావనతో ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.