సీనియర్‌ పాత్రికేయులు వాసుదేవదీక్షితులు కన్నుమూత

0
13
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
పత్రికారంగంలో విశ్లేషకుడిగా, సునిశిత విమర్శకుడిగా పేరుగాంచిన ప్రముఖ సీనియర్‌ పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల జర్నలిస్టులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా వాసుదేవ దీక్షితులు ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్‌గా, ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు.

1967లో ఆంధ్రప్రభ దినపత్రికలో జర్నలిస్ట్ కెరీర్ ప్రారంభించిన దీక్షితులు పలు హోదాల్లో పనిచేశారు.మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాసుదేవ దీక్షితులు మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.