ప్రాంగణ ఎంపికల్లో ముగ్గురు మిట్స్‌ విద్యార్థులకు ఉద్యోగాలు

0
14
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
చిత్తూరుజిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద గల మదనపల్లి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (మిట్స్‌ కళాశాల) నందు ఎం.బి.ఎ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ముత్తూట్ ప్రెసియస్ మెటల్స్ బెంగళూరు వారు నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో ముగ్గురు విద్యార్థులకు ఉద్యోగాలు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు.

కళాశాలలోని ఎం.బి.ఎ విద్యార్థులకు నిర్వహించిన ఇంటర్వ్యూలలో ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పించినట్లు ఆయన అన్నారు. మంజునాథ్, తేజోరాజ్, మరియు సిసింద్రీలు ఎంపికయిన విద్యార్థులలో ఉన్నారని, వీరు సంవత్సరానికి 3 లక్షల 50 వేల రూపాయలు జీతం పొందుతారన్నారు.

ఎంపికయిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, సీనియర్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ సర్వాన బాబు, ప్లేసెమెంట్ ఆఫీసర్ రవి కుమార్, అధ్యాపకులు మరియు తోటి విద్యార్థులు తదితరులు అభినందనలు తెలిపారు.