దూసుకుపోతున్న చెన్నై – రాజస్థాన్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపు

0
26
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ఐపీఎల్‌ సీజన్‌ -12లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. గురువారం రాత్రి జైపూర్‌ వేదికగా చివరిబంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసు కుంది.మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

స్టోక్స్‌ (26 బంతుల్లో 28; 1 ఫోర్‌) ఫర్వాలేదనిపించాడు. రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసి గెలిచింది. రాయుడు (47 బంతుల్లో 57; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ధోని (43 బంతుల్లో 58; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. స్టోక్స్‌కు 2 వికెట్లు దక్కాయి.

చివరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం కాగా,ధోని, జడేజా క్రీజులో ఉండగా స్టోక్స్‌ బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతిని జడేజా సిక్సర్‌గా బాదేశాడు. రెండో బంతి నోబాల్‌. జడేజా ఓ పరుగు చేశాడు. ఇక 5 బంతుల్లో 10 పరుగులు చేస్తే చాలు. స్ట్రయిక్‌లోకి వచ్చిన ధోని 2 పరుగులు చేశాడు.

కానీ ఆ మరుసటి బంతికి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. సాన్‌ట్నర్‌ రెండు పరుగులు చేశాడు. అయితే ఇది స్వల్ప వివాదాన్ని రేపింది. చివరకు ఐదో బంతికి మరో 2 పరుగులు తీశాడు. ఆఖరి బంతిని వైడ్‌గా వేయడంతో చివరి బంతికి 3 చేస్తే సరిపోతుంది. సాన్‌ ట్నర్‌ సిక్సర్‌ కొట్టడంతో ఉత్కంఠకు తెరపడి చెన్నై గెలిచింది.