తనకల్లు వద్ద మిని బస్సు-లారీ ఢీకొని 8 మంది దుర్మరణం

0
292
advertisment

మనఛానల్ న్యూస్ – కదిరి
అనంతపురం జిల్లా కదిరికి సమీపంలోని శుక్రవారం తెల్లవారు జామున మిని-బస్సు , లారి కొనడంతో 7 మంది మరణించారు. 42వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న కుక్కంటి క్రాస్‌ నుంచి ప్రయాణికులతో కదిరికి వెళ్తున్న మినీ బస్సు తనకల్లు మండలం పరాకువాండ్లపల్లి క్రాస్‌ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. 9మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. మృతుల్లో చాలా వరకు తనకల్లు మండలానికి చెందిన వారుగా గుర్తించారు.ప్రమాద స్థలంలో పరిస్థితి భీకరంగా కనిపిస్తోంది.