ఆసక్తిని రేకెత్తిస్తున్న నాని ‘జెర్సీ’ సినిమా ట్రైలర్‌

0
4
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకొని నేచురల్‌ స్టార్‌గా అభిమానులకు సుపరిచుతడయ్యాడు హీరో నాని. ఆయన కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. కాగా.. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు.

ఇందులో నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. క్రికెటర్‌గా అర్జున్‌ మైదానంలోకి అడుగుపెట్టడం, సహచర ఆట గాళ్లతో గొడవపెట్టుకోవడం, శ్రద్ధతో ప్రేమలో పడటం తదితర సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. పదేళ్ల తర్వాత అర్జున్‌ (నాని) క్రికెట్‌కు దూరమై అటు ఉద్యోగం లేక ఇటు కుటుంబాన్ని నెట్టుకురాలేక సతమతమవడాన్ని చూపించారు.

‘పదేళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్లీ మొదలుపెడతా..’ అంటూ నాని ఉద్వేగంతో చెబుతున్న డైలాగ్‌ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. ఏప్రిల్‌ 19న ‘జెర్సీ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.