భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

0
23
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
భారతీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 365 పాయింట్లు నష్టపోయి 38,573 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు నష్టపోయి 11,587 వద్ద ముగిశాయి.

తొలుత మార్కెట్లు మందకొడిగా కదిలినా చివర్లో భారీ నష్టాల్లోకి జారిపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు భారీగా పతనం కావడంతో మార్కెట్‌ కుంగింది. ప్రజ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 8శాతం లాభపడి రూ.149 మార్కును తాకాయి.

మరోపక్క ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. ఐఎంఎఫ్‌ వృద్ధి రేటును తగ్గించడంపై భయాలు నెలకొన్నాయి. మరోపక్క యూరప్‌-అమెరికా మధ్య ట్రేడ్‌వార్‌ మరోసారి భగ్గుమనడం కూడా మార్కెట్‌ భయాలకు కారణమైంది.