తెలంగాణలో విషాదం – మట్టిదిబ్బలు మీదపడి 10 మంది కూలీల మృతి

0
7
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నారాయణపేట
మట్టిదిబ్బలు మీద పడి 10 మంది ఉపాధి కూలీలు మృతిచెందిన విషాదకర సంఘటన తెలంగాణ నారాయణపేట (ఉమ్మడి మహబూబ్‌నగర్‌) జిల్లాలో చోటుచేసుకుంది.మరికల్‌ మండలం తీలేరుకు చెందిన ఉపాధి కూలీలు పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది.

గుట్టలాంటి ప్రదేశంలో పనులు చేపడుతుండగా నీడ కోసం గుట్ట కిందకు వెళ్లగా ఒక్కసారిగా మట్టి దిబ్బలు కూలీల మీద పడడంతో 10 మంది మృత్యువాత పడ్డారు.మృతిచెందిన వారంతా మహిళలే కావడం గమనార్హం.మంగళవారం వర్షం కురవడంతో మట్టి నానడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడే ఉన్న కూలీలు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. జేసీబీ సాయంతో వెంటనే మట్టిపెళ్లలు తొలగించారు.

ఘటనతో పనికోసం వచ్చిన వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కళ్లముందే తమ వారిని కోల్పోయిన బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనా స్థలికి చేరుకుని బాధితులను పరామ ర్శించారు.నారాయణపేట ఉపాధి కూలీల మృతి ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.