తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు

0
11
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – తిరుమల
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ఎన్‌ నరసింహన్‌ సతీసమేతంగా మంగళవారం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో గవర్నర్‌ దంపతులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వారు క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవరాహస్వామిని దర్శించుకున్నారు.

గవర్నర్‌ దంపతులు శ్రీవారి పుష్కరిణిలోకి చేరుకొని పవిత్ర జలాలను ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్‌ దంపతులకు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల ఇన్‌ఛార్జి జేఈవో లక్ష్మీకాంతం ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి, మేళతాళాలతో శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లారు.

స్వామి వారి దర్శనానంతరం హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వ చనం పలుకగా తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని గవర్నర్‌ దంపతులకు తితిదే ఈవో, జేఈవో అందజేసి సత్కరించారు.