ఏపీ ప్రత్యేకహోదాకు సంపూర్ణ సహకారం – తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం

0
6
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – వికారాబాద్‌
నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదా అంశానికి సంబంధించి తమ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెరాస అధినేత, ముఖ్య మంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని వికారాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఏపీ రాజకీ యాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు డిపాజిట్‌ రాకుండా ఓడిపోతున్నారని వ్యాఖ్యానించా రు.

దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్‌ అన్నారు. విద్యుత్‌ సరఫరాలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. ఇవాళ విద్యుత్‌ ఉంటే వార్త కాదని.. పోతే వార్త అని ఆయన వ్యాఖ్యానించారు. వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలపాలనే డిమాండ్‌ ఉందని దీనిపై ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత జీవో విడుదల చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఆంధ్రాకు ప్రత్యేక హోదాకు తెరాస సంపూర్ణంగా మద్దతిస్తుందని స్పష్టం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెరాస ఎంపీలు ఇప్పటికే లోక్‌సభలో చెప్పారని.. ఇకముందూ సహకరిస్తారని వ్యాఖ్యానించా రు. పోలవరం నిర్మాణానికి అడ్డుపడలేదని చెప్పారు. ‘ఆంధ్రా ప్రజలు మంచోళ్లే.. కొంత మంది రాజకీయ నాయకులే కిరికిరి చేస్తున్నారు. మనం బతకాలె.. వాళ్లు కూడా బతకాలె’ అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు వంటి కిరికిరి వ్యక్తులతో తప్ప ఆంధ్రప్రజలతో మనకెప్పుడూ పంచాయతీ లేదు. హైదరాబాద్‌పై ఆయన శాపాలు పెడుతున్నారు. డిపాజిట్‌ కూడా రాకుండా చంద్రబాబు ఓడిపోతున్నారు. తెలంగాణలో కచ్చితంగా 16 ఎంపీ స్థానాలు సాధి స్తాం. తెరాస, వైకాపా కలిసి 35 ఎంపీ స్థానాలు సాధిస్తాయని కేసీఆర్‌ అన్నారు.