ఉత్కంఠభరిత పోరులో హైదరాబాద్‌పై పంజాబ్‌ గెలుపు

0
12
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
సోమవారం రాత్రి హైదరాబాద్‌,పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో పంజాబ్‌ విజయం సాధించింది.దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా మరో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌లో ధాటిగా పరుగులు చేయలేకపోయింది. తర్వాత బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టులో నాలుగే వికెట్లు పడేసింది.

చివరకు ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యా టింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. వార్నర్‌ (62 బంతుల్లో 70 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధిం చాడు.

అశ్విన్, షమీ, ముజీబుర్‌ తలా ఒక వికెట్‌ తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి గెలిచింది. రాహుల్‌ (53 బంతుల్లో 71 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌), మయాంక్‌ (43 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. సందీప్‌ శర్మకు 2 వికెట్లు దక్కాయి.