హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీవర్షం

0
8
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవాం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో ఎండ తీవ్రతకు అల్లాడుతున్న హైదరాబాద్‌ నగరవాసులకు కాస్త ఉపశమనం లభించినట్లయింది.గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్‌లో పలుచోట్ల స్వల్ప వర్షం కురవగా సోమవారం మధ్యాహ్నమే భారీ వర్షం పడింది.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, ఖైరతాబాద్, లక్డీకపూల్, అమీర్‌పేట్, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అక్కడ క్కడా ఉరుములతో కూడిన ఓ మోస్తరు నుంచి చెదురుమదురు జల్లులు పడ్డాయి. నగరవాసులకు ఎండవేడిమి, ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం కలిగింది.

హైదరాబాద్‌లో మరో రెండు రోజులు వర్షం 

ఉత్తర కర్ణాటక నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు దక్షిణ కర్ణాటక, తమిళనాడు మీదు గా సముద్రమట్టానికి 0.9కిలోమీటర్ ఎత్తువరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నది. దీనిప్రభావంతో రెండురోజుల వరకు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఆదివారం చాలాప్రాంతాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, రామగుండం తదితర ప్రాంతాల్లో 40 నుం చి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యా యి. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురి సే అవకాశమున్నదని అధికారులు వెల్లడించారు.