మీ లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలను తీసుకోవాలి

0
101
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హెల్త్‌ డెస్క్‌
మానవ శరీరంలో అతిముఖ్యమైన అవయం కాలేయం.ఇది మన శరీరంలో అతిపెద్ద అవయం.ఇది మ‌న శ‌రీరంలో ప‌లు ముఖ్య‌మైన జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్ల‌ను లివ‌ర్ మ‌న శ‌రీరంలో నిల్వ చేస్తుంది.

అనంత‌రం అవ‌సరం అయిన‌ప్పుడు వాటిని ఉప‌యోగిస్తుంది. అలాగే శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను లివ‌ర్ బ‌య‌ట‌కు పంపు తుంది. శ‌రీరానికి శ‌క్తి నిరంత‌రం స‌రిగ్గా స‌ర‌ఫ‌రా అయ్యేలా చూస్తుంది. ఇంకా ఎన్నో ముఖ్య‌మైన ప‌నుల‌ను లివ‌ర్ నిర్వ‌ర్తి స్తుంది. అయితే లివ‌ర్ ఆరోగ్యం బాగున్న‌ప్పుడే అది స‌రిగ్గా ప‌నిచేయ‌గలుగుతుంది.

కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన ఆహార నియమాలు

– వెల్లుల్లిలో ఆలిసిన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది లివ‌ర్ లివ‌ర్‌లో ఉన్న వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌టకు పంపుతుంది. క‌నుక వెల్లుల్లిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.
– సిగ‌రెట్, మ‌ద్యం తాగ‌డం వ‌ల్ల లివ‌ర్ ప‌డే చెడు ప్ర‌భావాల‌ను త‌గ్గించుకోవాలంటే.. నిత్యం బీట్‌రూట్‌ను తీసుకోవాలి. బీట్‌రూట్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కార్సినోజెన్ల ప్ర‌భావం లివ‌ర్‌పై ప‌డ‌దు. లివ‌ర్‌లో ఉండే ఆయా విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.
– గ్రీన్ టీని నిత్యం తాగ‌డం వ‌ల్ల లివ‌ర్ సిర్రోసిస్‌, ఫ్యాటీ లివ‌ర్, హెప‌టైటిస్ త‌దిత‌ర లివ‌ర్ వ్యాధులు రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.
– క్యారెట్ల‌లో ఉండే మిన‌ర‌ల్స్, విట‌మిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, డైట‌రీ ఫైబ‌ర్ లివ‌ర్‌లో ఉండే కొవ్వు ప‌దార్థాల‌ను క‌రిగిస్తాయి. లివ‌ర్‌ను శుభ్రంగా చేస్తాయి. అలాగే నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేస్తాయి.
– నిత్యం నిమ్మ‌ర‌సం తాగ‌డం వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించుకోవ‌చ్చు. లివ‌ర్‌కు జ‌రిగే ఆక్సిడేటివ్ డ్యామేజ్‌ను నివారించాలంటే.. నిత్యం నిమ్మ‌ర‌సం తాగాలి.