అనునిత్యం ఆరెంజ్‌ జ్యూస్‌ తీసుకోవడంతో మీ గుండె పదిలం

0
187
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హెల్త్‌ డెస్క్‌
నారింజ పండ్ల రసాలను తీసుకోవడంతో మనలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే ప్రాణాంత‌క‌మైన స్ట్రోక్స్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. ఈ మేర‌కు స‌ద‌రు ప‌రిశోధ‌న‌ల‌కు చెందిన వివ‌రాల‌ను బ్రిటిష్ జ‌ర్న‌ల్ ఆఫ్ న్యూట్రిష‌న్‌లోనూ ప్ర‌చురించారు.

నిత్యం ఆరెంజ్ జ్యూస్ తాగే వారిలో బ్రెయిన్ క్లాట్ అయ్యే అవ‌కాశాలు 24 శాతం వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు తేల్చారు. అలాగే గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం 12 నుంచి 13 శాతం వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌.

అయితే కేవ‌లం ఆరెంజ్ జ్యూస్ మాత్ర‌మే కాదు, ఇత‌ర ఏ జ్యూస్‌ను అయినా స‌రే నిత్యం తాగితే ఏదో ఒక ర‌క‌మైన ప్ర‌యోజ‌నం క‌చ్చితంగా క‌లుగుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. కానీ వాటిలో చ‌క్కెర క‌ల‌ప‌కుండా తాగితేనే ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చ‌ని వారు అంటున్నారు.