01-01-2019 సోమవారం ప్రధాన వార్తలివే

0
62
advertisment

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్

అంచనాలు పెంచడం – అవినీతికి పాల్పడడం చంద్రబాబు లక్ష్యం – రాజమండ్రి సభలో ప్రధాని మోది విమర్శ             ఒక్క ఏడాదిలో 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ – రాహుల్‌ గాంధీ వెల్లడి                                                   వయనాడ్ లో రాహుల్ పై ఎన్.డి.ఎ అభ్యర్థిగా తుషార్ వెల్లపల్లి పోటి                                                            కాశ్మీర్ లో వేర్పాటువాది ఆస్తులను జప్తు చేసిన ఆదాయపన్నుశాఖ                                                 పాకిస్తాన్ బలవంతపు ఇస్లాం మత మార్పిడిలపై కెనడాలో నిరసన                                                           ప్రధాని మోది అనాగరికుడు – ఎన్.సి.పి నేత మీజీద్ మెమన్ విమర్శ                                                  ఇస్రోలో విజయవంతమైన ఇంటలిజెన్సీ శాటిలైట్ ప్రయోగం                                                                 గుంటూరు జిల్లా పొన్నూరు లో వై.ఎస్.షర్మిల ప్రచారం                                                                 బాబు,ఎల్లో మీడియాతో మన పోటి పెద్దాపురంలో ప్రచారం సభలో వై.ఎస్.జగన్                                         శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో వై.ఎస్.విజయమ్మ ప్రచారం

అంచనాలు పెంచడం – అవినీతికి పాల్పడడం చంద్రబాబు లక్ష్యం – రాజమండ్రి సభలో ప్రధాని మోది విమర్శ
విభజన ద్వారా ఏర్పర్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎంతో సహాయం అందించిందని అయితే చంద్రబాబు వాటిని దారి మళ్లీంచి అవినీతికి పాల్పడ్డరని భారత ప్రధాని నరేంద్రమోది విమర్శించారు. రాజమండ్రిలో జరిగిన బిజెపి ఎన్నికల సభల సోమవారం నరేంద్రమోది పాల్గోని ప్రసంగించారు. చంద్రబాబు పోలవరం అంచనాలను అవసరమెుచ్చినప్పుడల్లా పెంచుకోవడం అవినీతికి పాల్పడరని విమర్శించారు.పోలవరం నిర్మాణానికి తాము రూ.7వేలు కోట్లు ఇచ్చామని అయితే ఆ నధులు ఏమి చేశారో ఇ.సిలు ఇవ్వలేదని, దీనిని బట్టి నిధులు ఏక్కడికి వెళ్లాయో మీకందరికి తెలుసునని ఆయన అన్నారు.గత 40 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మోదీ ఆరోపించారు. తొలి కేబినెట్‌ భేటీలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని.. ఇప్పటి వరకు రూ.7వేల కోట్ల నిధులిచ్చామని చెప్పారు. ఈ ప్రాజెక్టు అంచనాలను తెదేపా ప్రభుత్వం పెంచుకుంటూ పోతోందన్నారు. ఈవిధంగా అంచనాలు పెంచుకోవడం ద్వారా ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని మోదీ దుయ్యబట్టారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఏపీ అభివృద్ధికి ఏన్డీయే సర్కార్‌ పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. రైతుల మేలు కోసం కేంద్రం అనేక పథకాలు చేపట్టిందన్నారు. ధాన్యంతో కలిపి 22 రకాల పంటలకు గిట్టుబాటు ధరను రెండున్నర రెట్లు పెంచిందని మోదీ వివరించారు. మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. వారికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఇప్పటికే ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రత్యేక బడ్జెట్‌ కూడా ఏర్పాటు చేశామని.. కిసాన్‌ కార్డుల తరహాలో మత్స్యకారులకూ క్రెడిట్‌ కార్డులు ఇస్తున్నామన్నారు.

ఒక్క ఏడాదిలో 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ – రాహుల్‌ గాంధీ వెల్లడి

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిరుద్యోగ యువతకు పలు హామీలను ప్రకటించారు.ఇటీవలే పేద, మధ్య తరగతి ప్రజల కోసం ‘న్యాయ్‌’ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి విదితమే.తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోపే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.మోదీ సర్కారు విధానాలతో దేశంలో అనేక మంది ఉద్యోగాలను కోల్పోయారన్న రాహుల్‌ ఉద్యోగ కల్పనలోనూ ఎన్డీయే సర్కా రు విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో 22 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న రాహుల్‌ అధికారంలోకి వస్తే 2020 మార్చి 31 నాటికి వీటన్నింటికి భర్తీ చేస్తామని ట్విటర్‌లో పేర్కొన్నారు.మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను బలో పేతం చేయాలనే లక్ష్యంతో అమేఠీ సహా కేరళలోని వయనాడ్‌ నుంచి రాహుల్‌ పోటీ చేయనున్నారు.

వయనాడ్ లో రాహుల్ పై ఎన్.డి.ఎ అభ్యర్థిగా తుషార్ వెల్లపల్లి పోటి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధి దక్షణాదిలో పోటి చేస్తున్న రెండవ లోకసభ స్థానానికి ఎన్.డి.ఎ తరపున అభ్యర్థిని సిద్ధం చేశారు. భారతీయ దర్మసేన అధ్యక్,ులు తుషార్ వెల్లపల్లిని తమ అభ్యర్థిగా నిర్ణయించారు.దీనిపై ఆయన స్పందిస్తూ బిజెపి దాని మిత్రపక్షాల తరపున ఎన్.డి.ఏ అభ్యర్థిగా వయనాడ్ లో రాహుల్ పై తనను పోటి అభ్యర్థిగా నిలబడుతున్నందుకు గర్విస్తున్నాని తెలిపారు.
కాశ్మీర్ లో వేర్పాటువాది ఆస్తులను జప్తు చేసిన ఆదాయపన్నుశాఖ
కాశ్మీర్ లో ఇటివల నిషేదానికి గురైన వేర్పాటు వాద సంస్థలకు చెందిన ఆస్తులను సోమవారం కేంద్ర ఆదాయపన్ను శాఖ జప్తు చేసింది. కాశ్మీర్ వేర్పాటువాద ఉద్యమ నాయకుడు సయ్యద్ ఆలీ షా గిలానీకి రూ.3కోట్ల 62లక్షల రూపాయిల పన్ను బకాయిలు చెల్లంచనందున ఈ జప్తు చేసినట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు.
పాకిస్తాన్ బలవంతపు ఇస్లాం మత మార్పిడిలపై కెనడాలో నిరసన
పాకిస్తాన్ లోని సింధ్ రాష్ట్రంలో హిందు మతానికి చెందిన యువతులను విహహం చేసుకొంటూ వారిని బలవంతంగా ఇస్లాం మతమార్పిడి చేయడాన్ని నిరసిస్తూ కెనడాలో భారతీయులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మార్చి 20వ తేదిన హోళి పండుగ సందర్భంగా ఇరువురు హిందు మహిళను పెండ్లి చేసుకొని బలవంతంగా ఇస్లాంలోకి మత మార్పిడి చేశారు. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగింది.దీనిపై కెనడాలోని హిందువులు నిరసన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం తక్షణం ఇలాంటి వాటిని నివారించి మైనార్టీలైన హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోది అనాగరికుడు – ఎన్.సి.పి నేత మీజీద్ మెమన్ విమర్శ
మహారాష్ట్రకు చెందిన ఎన్.సి.పి నేత, రాజ్యసభ సభ్యుడు మజీద్ మీనన్ ప్రధాని మోదిపై తీవ్రమైన వాఖ్యలతో విమర్సించారు. కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో పాకిస్తాన్ లో పోటి చేయాలని ప్రధాని చేసిన విమర్శలపై స్పందిస్తున్న ప్రధాని మోది అనాగరికుడు, అజ్ఞాని అని విమర్శించారు. ఇత దిగజారుడు వ్యక్తి ప్రధాని కావడం ఘోరమని అన్నారు. బిజెపి నేపాల్ లో పోటి చేయాలని సూచించారు

advertisment

 ఇస్రోలో విజయవంతమైన ఇంటలిజెన్సీ శాటిలైట్ ప్రయోగం
ఏపిలోని శ్రీహరికోటలో గల అంతర్జాతీయ అంతర్జాతీయ పరిశోధన సంస్థ సోమవారం ప్రయోగించిన ఇంటలిజెన్సీ శాటిలైట్ ఉపగ్రహం విజయవంతం అయింది. దీంతో అంతరిక్ష పరిశోధనలో ఇస్రో కొత్త అద్యాయం నమెదు అయింది. పిఎస్ఎల్వీ-45 వాహకనౌక ద్వారా 28 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు.

గుంటూరు జిల్లా పొన్నూరు లో వై.ఎస్.షర్మిల ప్రచారం
ఏప్రిల్ 11న జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా వైకాపా అధినేత వై.ఎస్ జగన్ సోదరి షర్మిల సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షరతులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేని చంద్రబాబు రోషం, పౌరుషం గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. పవన్,టిడిపి కాంగ్రెస్‌ పార్టీలతో లోపాయకారీ ఒప్పందాలు చేసుకొని నిసిగ్గుగా వైయస్‌ఆర్‌ సీపీపై ఆరోపణలు చేస్తున్నాడు. వైయస్‌ఆర్‌ సీపీకి ఎవరితో పొత్తులు అవసరం లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది, ప్రజల ఆశీర్వాదంతో బంపర్‌ మెజార్టీ సాధిస్తుందని వైయస్‌ షర్మిల అన్నారు.

 బాబు,ఎల్లో మీడియాతో మన పోటి పెద్దాపురంలో ప్రచారం సభలో వై.ఎస్.జగన్                                             ఎపిలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చంద్రబాబు ఒక్కరితోనే పోటి చేయడం లేదని, ఎల్లోమీడియాతోను కూడా మనం యుద్ధం చేస్తున్నామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. తూర్పుగొదావరి జిల్లా పెద్దాపురం లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లు చంద్రబాబు పాలనలో మోసాలు, అబద్దాలు, అన్యాయాలు చూశామని, ఎన్నికలు సమీపించేకొద్ది ఈ కుట్రలు, మోసాలు ఎక్కువవుతాయన్నారు. మరో 20 రోజులు ఓపిక పడితే అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రతి ఒక్కరికి చెప్పాలని పిలుపునిచ్చారు.                                                      శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో వై.ఎస్.విజయమ్మ ప్రచారం
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో ఎన్నికల ప్రచారం లో పాల్గోన్నారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ఏప్రిల్ 11న జరిగే ఏపి అసెంబ్లీ ఎన్నికలు న్యాయానికి,అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతుంది.ధర్మానికి,అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. విలువలకు,విశ్వసనీయతకు ఓటు వేయాలని కోరుతున్నా.ఎక్కడ చూసిన అన్యాయం,అక్రమం,మోసం..ఇసుకు నుంచి మట్టి దాకా..మట్టి నుంచి బొగ్గు దాకా..బొగ్గు నుంచి రా«జధాని భూములు దాకా..ఆలయ,దళితుల భూములను కూడా వదలిపెట్టడం లేదు.వైయస్‌ కుటుంబంతో ఉన్న అనుబంధం ఒకసారి గుర్తుచేసుకోండి.40 సంవత్సరాల అనుబంధం.వైయస్‌ఆర్‌ను 30 సంవత్సరాలు మీ భుజస్కందాలపై మోసుకుని సీఎం చేసుకున్నారు. ఆయన ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారనే విషయాన్ని గుర్తించి జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.