వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయం – రామసముద్రం రోడ్డు షోలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

0
673

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
ఏప్రిల్‌ 11న ఏపీలో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం చిత్తూరుజిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో వైసిపి అభ్యర్థి నవాజ్‌ బాషా, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులతో కలసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా రాముసముద్రంలో నిర్వహించిన రోడ్‌ షోకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మరో 10 రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అనేక మోసాలు చేసి మళ్లీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు ప్రయత్నిస్తారని, వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజాసంకల్ప యాత్రతో రాష్ట్రంలో అన్ని జిల్లాలో పాదయాత్ర నిర్వహించి వై.ఎస్‌.జగన్‌ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారన్నారు. ప్రజల కష్టాలను తీర్చడానికే నవరత్నాలను రూపొందించారన్నారు.

ఈ నవరత్నాల ద్వారా ప్రతికుటుంబానికి లబ్ధిచేకూరుతుందన్నారు. తెదేపా ప్రభుత్వం హయాంలో రైతులు అప్పుల పాల య్యారన్నారు. ముఖ్యంగా మదనపల్లి డివిజన్‌లో అధికశాతం మంది రైతులు టమోటో పంట మీద ఆధారపడి జీవిస్తున్నా రని, ఆ పంట మీద లక్షలాది రూపాయలు వెచ్చించారని, అయితే సంవత్సర కాలం నుండి సరైన గిట్టుబాటు ధరలు లేక, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. రాజన్న రాజ్యం సాకారం కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు.మీ కష్టాలను నేను విన్నాను .. .నేను ఉన్నాను అంటున్న జగనన్నకు ఒక్క అవకాశమిద్దామని ఆయన పిలుపునిచ్చారు.

వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై మీ ఓటు వేసి మదనపల్లి అసెంబ్లీ అభ్యర్థి నవాజ్‌ బాషా, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధి పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.ఈ కార్య క్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.