హైబీపీ నుండి ఉపశమనం కలిగించే తాటిముంజలు

0
55
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హెల్త్‌ డెస్క్‌
ప్రస్తుతం చిన్న, పెద్ద తేడా లేకుండా వస్తున్న జబ్బు అధిక రక్తపోటు (హైబీపీ). ప్రజలు అనుసరిస్తున్న ఆహార విధానాలు, ఒత్తిడితో కూడిన జీవనమే ఇందుకు కారణం.హైబీపీకి తాటిముంజలతో చెక్‌పెట్టవచ్చునని వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ సీజ‌న్‌లో మ‌న‌కు తాటి ముంజ‌లు ఎక్కువ‌గా దొరుకుతాయ‌న్న విష‌యం విదిత‌మే. చాలా మంది వాటిని తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. మండే వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌ని తాటి ముంజ‌ల‌ను తింటుంటే వ‌చ్చే మ‌జాయే వేరుగా ఉంటుంది.

అయితే కేవ‌లం రుచికే కాదు, ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందివ్వ‌డంలోనూ తాటి ముంజ‌లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

– తాటి ముంజ‌లు తిన‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. వేస‌వి తాపం త‌గ్గుతుంది.
– తాటి ముంజ‌ల్లో విట‌మిన్ ఎ, బి, సి, ఐర‌న్‌, జింక్‌, పాస్ఫ‌ర‌స్‌, పొటాషియం త‌దిత‌ర పోషకాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది.
– తాటి ముంజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
– తాటి ముంజ‌ల్లో ఉండే కాల్షియం ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తుంది.
– లివ‌ర్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు తాటి ముంజ‌ల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది.