తంభళ్లపల్లి అసెంబ్లీ ఎన్నికలలో పోటి చేసే అభ్యర్థులు వీరే

0
591

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
తంభళ్లపల్లి అసెంబ్లీ ఎన్నికలలో పోటి చేసే అభ్యర్థులను గురువారం సాయంకాలం ఆ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మెుత్తం 12 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. ఒకే ఇ.వి.ఎం. మిషన్ ను ఇక్కడ వినియోగించనున్నారు.
పోటిలో ఉన్న అభ్యర్థులు వీరే .
1. గుళ్లోల్ల శంకర యాదవ్ – టిడిపి
2. ఎం.ఎల్.చంద్రశేఖర్ రెడ్డి – కాంగ్రెస్
3. పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి – వై.ఎస్.ఆర్ కాంగ్రెస్
4.కె.గంగరాజు – ఇండియన్ లేబర్ పార్టీ
5. మలిపెద్ది ప్రభాకర్ రెడ్డి – జనసేన పార్టీ
6. పి.వెంకటరెడ్డి – జనతా దళ్ (సెక్యులర్)
7. సి.వెంకటరమణరెడ్డి – పిరమిడ్ పార్టీ
8. శీతన్నగారి రెడ్డి – ఇండియన్ ముస్లీంలీగ్
9. వి.అశ్రిప్ – ఇండిపెండెంట్
10. నాగురి విశ్వనాథరెడ్డి – ఇండిపెండెంట్
11. ముట్రమాదవరెడ్డి – ఇండిపెండెంట్
12. ముసలికుంట మస్తాన్ రెడ్డి – ఇండిపెండెంట్
ఈ ఏన్నికలలో బిజెపి రంగంలో లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. గత అనేక సంవత్సరాలుగా రంగంలో నిలిచిన బిజెపి ఈసారి పోటిలో లేదు.