ప్రతి రోజూ వాకింగ్‌తో మీ ఆరోగ్యం పదిలం

0
21
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హెల్త్‌ డెస్క్‌
నిత్యజీవితంలో మానవులు ఒత్తిడికి లోనవుతున్నారు. దీనివల్ల పలు అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు.అయితే ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా వాకింగ్‌ చేయడం వలన వారి ఆరోగ్యం పదిలంగా ఉంటుందని వైద్య నిపుణుల అభిప్రాయం. వాకింగ్ చేయడం వ‌ల్ల ఎన్ని ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే.

వాకింగ్ వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. మ‌ధుమేహం అదుపులో ఉంటుంది. ఇంకా ఎన్నో లాభాలు వాకింగ్ వ‌ల్ల మ‌న‌కు క‌లుగుతాయి. అయితే నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది.

85 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న 88వేల మందిని ప‌లువురు సైంటిస్టులు కొన్నేళ్ల పాటు ప‌రిశీలించారు. వారు నిత్యం చేసే వ్యాయా మాలు, వారికి ఉన్న వ్యాధులు త‌దిత‌ర వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సేక‌రించారు. దీంతో చివ‌రికి తేలిందేమిటంటే వారంలో క‌నీసం 10 నుంచి 59 నిమిషాల పాటు వాకింగ్ లేదా తోట‌ప‌ని చేసిన వారికి హార్ట్ ఎటాక్స్ వ‌చ్చే అవ‌కాశాలు 18 శాతం వ‌ర‌కు త‌గ్గాయ‌ని తేల్చారు.

అంతేకాదు, అస‌లు ఎలాంటి శారీర‌క శ్ర‌మ చేయ‌నివారితో పోలిస్తే వారంలో ఎంతో కొంత వ్యాయామం లేదా శారీర‌క శ్ర‌మ చేసే వారు మిక్కిలి ఆరోగ్యంగా ఉన్నార‌ని సైంటిస్టులు గుర్తించారు. అందువ‌ల్ల నిత్యం వాకింగ్ లేదా తోట‌పని, ఇంటి ప‌ని వంటివి చేస్తే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని, గుండె జ‌బ్బులు, క్యాన్సర్ రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.