అసత్యానికి అంబాసిడర్ చంద్రబాబు – వై.ఎస్.జగన్ సోదరి వై.ఎస్.షర్మీల

0
71
advertisment

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఎపి ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు అసత్యాలకు అంబాసిడర్ అని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ సోదరి షర్మిల విమర్శించారు. సోమవారం ఉదయం విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆమె పాల్గోన్నారు.

ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయడం అలవాటు అని 2014 ఎన్నికలప్పుడు 600 హామీలు ఇచ్చి నేటికి ఒక్క హామి కూడ అమలు చేయకుండ ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు కొత్త హామీలతో మళ్లీ మీ ముందుకు వస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

40 సంవత్సరాల అనుభవజ్ఞుడని ప్రజలు ఓట్లు వేస్తే ఏమి సాధించారని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పూటకో మాటతో బిజెపితో కలిసి మోసం చేశారని ఆమె విమర్శించారు.

బాబు వస్తే జాబు అన్నారని ఈ 5సంవత్సరాలలో నిరుద్యోగులకి ఎంత మందికి జాబు ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు తన సుపుత్రుడు నారా లోకేష్ కు ఏకంగా మూడు మంత్రి శాఖలు ఇచ్చి పుత్ర వాత్సాల్యన్ని చూపుకొన్నారని, లోకేష్ కు వర్థంతికి జయంతికి తేడా తెలియదని, ఇలాంటి వ్యక్తి మంత్రి పదవికి ఏవిధంగా అర్హుడని ఆమె ప్రశ్నించారు. వై.ఎస్.షర్మిల ఎన్నికల ప్రచారం షెడ్యూల్ విడుదల అయింది. ఆమె రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలలో ప్రచారం చేయనున్నారు.