వైకాపా అభ్యర్థులలో 41 మంది బిసిలకు అవకాశం – అనుభవజ్ఞులకు జాబితాలో చోటు

0
109
advertisment

మనఛానల్ న్యూస్ – అమరావతి
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికలలో బి.సి అభ్యర్థులకు సముచిత స్థానం కల్పించింది.  గతం కంటే భిన్నంగా బి.సి. ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో వైకాపా అధినేత వై.ఎస్.జగన్ ఒత్తిళ్లకు తలోగ్గక సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. గెలుపే లక్ష్యంగా రాజకీయాలలో అనుభవం, ఎన్నికలు ఎదుర్కొవడంలో నైపుణ్యం గల వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించింది.

అభ్యర్థుల ఎంపికలో వై.ఎస్.జగన్ అత్యంత పరిణితి కనిపించారని , ఓడిపోయే అవకాశం ఉన్న వారిని దూరం పెట్టి ఎంపిక చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆదివారం ప్రకటించిన 175 మంది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులలో 41మంది బి.సిలు ఉండడం విశేషం.ఎస్.సిలకు 25, ఎస్.టి.లకు15 సీట్లు, మైనార్టీలకు 5 సీట్లు కేటాయించారు.

ఈసారి జగన్ ఆచితూచి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తప్పనిసరిగా గెలవాలనే ఉద్దేశ్యంతో సొంతవారిని సైతం దూరంగా పెట్టేశారు. విద్యావంతులకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. యువతని  ప్రొత్సహించారు. 175 మందిలో 45 ఎళ్ళలోపు వారు 33 మంది ఉన్నారు. 45-60 సంవత్సరాల వయసులోపు వారు 98 మంది ఉన్నారు.

145 మంది అభ్యర్థులు రాజకీయాలలో అత్యంత అనుభవం కల్గిన వారు, ఎం.ఎల్.ఎ.,ఎం.ఎల్.సి, ఎం.పిలుగా, మంత్రులుగా పనిచేసినవారు ఉండడం వల్ల ఎన్నికల నిర్వహణ సులువుగా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

విద్యావంతులకు పెద్దపీట వేశారు. గ్రాడ్యుయేట్స్ 98 మంది, పోస్టుగ్రాడ్యుయేట్స్ 48 మంది, డాక్టర్లు 15 మంది ఉన్నారు. అఖిల భారత సర్వీసులు అంటే ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.లు 9 మంది, కేంద్రసర్వీసులకు చెందిన వారు 9 మంది ఉండడం గమనార్హం.

advertisment

మెుత్తం మీద గత ఎన్నికల అనుభవం నుంచి వై.ఎస్.జగన్ బాగా పాఠాలు నేర్చుకొన్నట్లు తెలుస్తోంది. పలు సర్వేలు, సామాజీక సమీకరణలను బేరీజు వేసుకొంటూ అభ్యర్థుల ఎంపిక చేయడం విశేషం. గతంలో ఎన్నికైన సిట్టింగ్ లలో 40 మందికి మళ్లీ సీట్లు ఇచ్చారు.