మదనపల్లి బిజెపి అభ్యర్థిగా బండి ఆనంద్

0
90
advertisment

మనఛానల్ న్యూస్ -మదనపల్లి
మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా బిజెవైఎం రాష్ట్రఉపాధ్యక్షుడు బండి ఆనంద్ పేరును ఆపార్టీ ప్రకటించింది. ఈమేరకు ఆదివారం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాల మేరకు ఎపిలో బిజెపి తరపున పోటి చేసే 123 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

అందులో మదనపల్లి పట్టణానికి చెందిన యువ నాయకుడు బండి ఆనంద్ మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా పోటి చేస్తారని ప్రకటించింది. ప్రస్తుతం పార్టీలో బండి ఆనంద్ చురుకుగా వ్యవహరిస్తున్నారు.