పీలేరు బిజెపి అభ్యర్థిగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి

0
46
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పులి నరేంద్ర కుమార్ రెడ్డిని బిజెపి రాష్ట్ర శాఖ ఎంపిక చేసింది. బిజెపి కేంద్ర నాయకత్వం ఆదేశాల మేర రాష్ట్ర బిజెపి ఆంద్రప్రదేశ్ లో పోటి చేసే 123 మంది అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం ప్రకటించింది.

ఇందులో పీలేరు నియోజకవర్గంలో బిజెపి తరపున ఎం.ఎల్.ఎ అభ్యర్థిగా నరేంద్ర కుమార్ రెడ్డిని పోటి చేయాలని పార్టీ ఆదేశించింది. నరేంద్రరెడ్డి ప్రస్తుతం బిజెపిలో వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గోంటున్నారు. నరేంద్రమోది నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ పథకాలపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు.

సోషల్ మీడియాలో సైతం పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నరేంద్ర కుమార్ రెడ్డి స్వస్థలం వాల్మీకిపురం మండలం విఠలం. ఈయనను పీలేరు బిజెపి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.