దొమ్మలపాటికే మదనపల్లి టికెట్ – టిడిపిలో పెరిగిన జోష్

0
125
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
తెలుగుదేశం పార్టీ అధిష్టానవర్గం నాన్చుడు ధోరణితో ఇన్నాళ్లు స్థబ్ధతగా ఉన్న మదనపల్లి తెలుగుదేశంలో టిడిపి అభ్యర్థిగా మాజీ ఎం.ఎల్.ఎ దొమ్మలపాటిని ప్రకటించడంతో ఆ పార్టీలో ఉత్సహాంగా మెుదలైంది.

మదనపల్లి నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎం.ఎల్.ఎ దేశాయ్ తిప్పారెడ్డికి టికెట్ నిరాకరించి ఆయన స్థానంలో మైనార్టీ అభ్యర్థిగా స్థానికుడైన ఎస్.ఎల్.టి బస్సు ట్రావెల్స్ యజమాని నవాజ్ భాషను రంగంలోకి దింపడంతో తన అనుభవం, నియోజకవర్గంలో పార్టీకున్న పటిష్టమైన యంత్రాంగం సహకారంతో తన విజయం సునాయాసమని దొమ్మలపాటి భావిస్తున్నట్లు తెలిసింది.

ప్రధాన ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి నవాజ్ భాషకు సిట్టింగ్ ఎం.ఎల్.ఎ సహకారం లేకపోవడం, వైకాపాను ఆదరిస్తున్న ప్రధాన సామాజికవర్గంలో పార్టీ ప్రకటించిన అభ్యర్థిపై కొంత అసంతృప్తి ఉందని,దానిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

చాలా కాలం తర్వాత దొమ్మలపాటికి మరోసారి పోటి చేసే అవకాశం రావడంతో ఏదోక విధంగా శ్రమించి విజయం సాధించాలని ఆయన పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. మదవపల్లి ఎన్నికలలో అభ్యర్థి విజయాన్ని ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉన్నాయి. వీటిని అధిక మించి రమేష్ విజయాన్ని ఏవిధంగా చేరుకొంటారో వేచి చూద్దాం.