జనసేనలోకి జేడి లక్ష్మీనారాయణ

0
102
advertisment

మనఛానల్ న్యూస్ – అమరావతి
సిబిఐ మాజీ జాయింట్ డైరక్టర్ జె.డి.లక్ష్మీనారాయణ ఎట్టికేలకు జనసేన పార్టీలో ఆదివారం చేరారు. ఆయన రాజకీయాలలోకి వస్తారా లేదా అనే అంశం సర్వత్ర చర్చనీయాంశంగామారింది. ఈతరుణంలో ఆయన ఓ దశలో తెలుగుదేశం వైపు వెళ్లుతారనే ప్రచారం జరిగింది.

విశాఖ పట్టణం జిల్లా భీమిలీ నుంచి పోటి చేయబోతున్నట్లు కూడ ప్రచారం జరిగింది. తాను ఈసారి ఎన్నికలలో పోటి చేయబోనని కూడ జె.డి.ప్రకటించారు. ఇటువంటి డైలమా పరిస్థితులలో చివరికి జనసేనలో చేరడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మంచి జ్ఞాన సంపద, ధైర్యం, ప్రజాదరణ.. ఈ మూడు లక్షణాలు ఉన్న వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని కొనియాడారు. ప్రజల కోసం, ప్రజాసేవలో పనిచేస్తున్న పవన్‌ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. జనసైనికుల్లో తాను కూడా తానొకడిగా మారిపోయానని తెలిపారు. పవన్‌ మార్గదర్శకత్వంలో మనమంతా ముందుకువెళ్తూ.. ప్రజలు మనపై పెట్టుకున్న ఆశలను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామన్నారు.