
మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరుజిల్లా మదనపల్లి సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల నందు ఎలెక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్(ఈ.సి.ఈ) విభాగము వారు బి.టెక్ చదువుతున్న ద్వితీయ మరియు తృతీయ విద్యార్థిని విద్యార్థులకు “ఎంబెడ్డెడ్ సిస్టమ్స్ ప్రిన్సిపుల్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్” అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా బెంగళూరులోని ఈఆర్ టి టెక్నికల్ సర్వీసెస్ కంపెనీ డైరెక్టర్ ఆర్.పి.చేతన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆయన మాట్లాడుతూ కమ్యూనికేషన్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఈ కమ్యూ నికేషన్ రంగం నందు కొత్త టెక్నాలజీస్ అయిన 5జీ టెక్నాలజీ నందు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
మైక్రో కంట్రోలర్ ఎలెక్ట్రానిక్స్ రంగం నందు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు, మైక్రో కంట్రోలర్ ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలయి న ఆటోమేటిక్ వస్తువులు మరియు ఆటోమొబైల్ ఇంజిన్ నియంత్రణ వ్యవస్థలు, ఇంప్లాంటబుల్ వైద్య పరికరాలు, రిమోట్ కంట్రోల్స్, కార్యాలయ యంత్రాలు, ఉపకరణాలు, పవర్ టూల్స్, బొమ్మలు మరియు ఇతర ఎంబెడెడ్ వ్యవస్థలలో ఉపయో గిస్తారు.
చివరిగా ఆయన మాట్లాడుతూ మైక్రో కంట్రోలర్ మరియు ఎంబెడెడ్ సిస్టమ్స్ నందు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయ న్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ తదితరులు పాల్గొ న్నారు.