వైకాపాలోకి నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి

0
34
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – కర్నూలు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్‌సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి.పలువురు నేతలు, వివిధ రంగాల ప్రముఖుల చేరిక, ఆ సందర్భంగా తరలివస్తున్న వారితో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నివాసం కిటకిటలాడుతోంది.

గురువారం నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, గురు రాఘవేంద్ర బ్యాంకు కోచింగ్‌ సెంటర్‌ స్థాపకులు దస్త గిరిరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలో కి ఆహ్వానించారు.

వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, నాయకులు శిల్పా మోహన్‌ రెడ్డి, సిదార్థరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్య క్రమం జరిగింది. ఈ సందర్భంగా లబ్బి వెంకటస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంతృత్వ పోక డలకు పోతున్నారని విమర్శించారు.

ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ గెలుపు కోసం పనిచేస్తానని తెలిపారు. అనంతరం దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఓ నిరుద్యోగ యువత చాలా సమస్యలు ఎదుర్కొంటుందని తెలిపారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యలు తొలుగుతాయన్నారు. నంద్యాలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు సపోర్ట్‌ చేస్తానని వెల్లడించారు.