మహేష్‌, ప్రభాస్‌లను వెనక్కి నెట్టిన వర్ధమాన హీరో విజయ్‌ దేవరకొండ

0
14
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
అర్జున్‌రెడ్డి, గీతగోవిందం, ట్యాక్సీవాలా తదితర చిత్రాల్లో ఘనవిజయాలను సొంతం చేసుకున్నాడు టాలీవుడ్‌ వర్ధమాన హీరో విజయ్‌ దేవరకొండ.అభిమానుల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు.సినిమాల ఎంపికలోనే కాదు క్రేజ్‌ పరంగానూ విజయ్‌ ఇమేజ్‌ తారాస్థాయికి చేరింది.

తాజాగా 2018 హైదరాబాద్‌ మోస్ట్ డిజైరబుల్‌ మేన్‌ లిస్ట్‌లో విజయ్ టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. హైదరాబాద్‌ టైమ్స్ నిర్వహించి న సర్వేలో టాలీవుడ్ టాప్‌ హీరోలు ప్రభాస్‌, మహేష్‌ బాబు, రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ లాంటి వాళ్లను వెనక్కి నెట్టి విజయ్‌ మొద టి స్థానం దక్కించుకున్నాడు.గత ఏడాది రెండో స్థానంలో నిలిచిన విజయ్‌ దేవరకొండ, ఈ ఏడాది తొలి స్థానంలో నిలిచి సత్తా చాటాడు.

గత ఏడాది తొలి స్థానం సాధించిన మోడల్ బసీర్‌ అలీ ఈ ఏడాది ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్ సినిమా షూటింగ్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లోనూ నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ స్పోర్ట్స్ డ్రామాలో నటించేందుకు ఓకె చెప్పాడు.